చిట్లు” ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా సరే ఇది ఎక్కువగా వినపడుతున్న పధం. పది మంది కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడి చిట్ కట్టుకోవడం, నెలకు ఒకరు పాడుకోవడం, అవసరాలను బట్టి చీటీ పాడుకోవడం వంటివి మనం చూస్తున్నాం. అయితే ఇందులో మోసాలు ఉండటంతో ప్రజలు కాస్త భయపడుతూ ఉంటారు. కొంత మంది డబ్బులు అన్ని తీసుకుని పారిపోవడం, మోసాలు చేయడం వంటివి కేసులు, కోర్టుల వరకు కూడా వెళ్తున్నాయి. ఈ మధ్య ఈ కేసులు పోలీసులను కూడా చికాకు పెడుతూనే ఉన్నాయి.
అది పక్కన పెడితే, అసలు ఇవి ఆర్ధిక జీవనానికి ఎంత వరకు శ్రేయస్కరం. కచ్చితంగా ఉపయోగమే అంటున్నారు నిపుణులు. నమ్మకస్తులు ఉండాలి గాని అవి చాలా సహకరిస్తాయని అంటున్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరించడం కీలకం అంటున్నారు. ఉదాహరణకు మీరు లక్ష రూపాయలు చీటీ ఎంపిక చేసుకున్నారు అనుకుందాం. ఈ లక్ష రూపాయలకు నెలకు మీరు పది వేలు కట్టాలి. కడితే మీకు చివర్లో వచ్చేది 90 వేల వరకు ఉంటుంది. పది వేలు నష్టం కదా అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కాని ఎదుటి వారి అవసరమే మనకు కలిసి వస్తుంది.
ఎలా అంటే, వాళ్ళు అవసరాన్ని బట్టి 70 వేలు 80 వేలు తీసుకున్నారు అనుకోండి. మీరు నెలకు కట్టేది 7,500, 8 వేలు వరకే ఉంటుంది. ఒక నెల 8 వేలు, ఒక నెల 8,500 కట్టడమే. అంటే మిగిలిన సొమ్ము మీకు ఆధానే కదా…? అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ నెల మీరు చీటీ పాడేసుకున్నారు అనుకుందాం, 90 వేలు మంచి ధర వచ్చింది. ఆ డబ్బులను అదే గ్రూపులో వేరే వారికి వడ్డీకి ఇచ్చుకోండి. లేదా బయట వడ్డీ అవసరం ఉన్న వాళ్లకు ఇచ్చుకోండి. వచ్చే వడ్డీ తో చీటీ కట్టవచ్చు, అసలు సొమ్ము మిగులుతుంది. పైన మిగిలే 2000, 1500 కూడా మిగిలుతాయి. వచ్చిన సొమ్ముతో విలువైన వస్తువులు కొనుగోలు చేసుకోండి, స్మార్ట్ ఫోన్లు కాదండోయ్, బంగారం అలాంటివి.