న్యూ ఇయ‌ర్‌.. న్యూ రికార్డ్‌: ఆ విష‌యంలో ఇండియానే ఫ‌స్ట్ ప్లేస్‌..

-

కొత్త ఏడాది ప్రారంభం రోజునే భారత్‌ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. కొత్త ఏడాది మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 4 లక్షల మంది పిల్లలు పుడితే వారిలో భారత్‌లోనే 67,385 మంది పుట్టినట్టు ఐక్యరాజ్యసమితికి చెందిన శిశు సంరక్షణ సంస్థ యూనిసెఫ్‌ వెల్లడించింది. దీంతో ప్రపంచ జనాభాలో రెండోస్థానంలో ఉన్న మన దేశం 2020 జనవరి 1న శిశు జననాల్లో టాప్‌గా నిలిచింది. ఇక ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉన్న చైనా 46,299 శిశు జననాలతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.

‘కొత్త సంవత్సరం ప్రారంభం, అందులోనూ కొత్త దశాబ్దం అంటే ప్రపంచ ప్రజల ఆశలు, ఆకాంక్షలు భవిష్యత్తే కాదు, కొత్తగా పుట్టిన వారి భవిష్యత్‌ కూడా’ అని యూనిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్రియెట్ట ఫోర్‌ అన్నారు. మొత్తంగా జన్మించిన 3,92,078 శిశువుల్లో సగం మంది కేవలం ఎనిమిది దేశాల్లోనే జన్మించారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరి 1న తొలి శిశువు జన్మించిన దేశం ఫిజి అవ్వ‌గా.. ఆఖరి శిశువు జన్మించిన దేశం అమెరికా అయింది.

Read more RELATED
Recommended to you

Latest news