ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు నిరసన సెగ తగిలింది. బీజేపీ తరపున హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో కంగనాకు అక్కడి ప్రజలు నిరసన వ్యక్తం చేశారు.ఈరోజు లాహౌల్-స్పితి లోయలో ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లగా అక్కడి ప్రజలు గో బ్యాక్ కంగనా అంటూ నల్ల జెండాలతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో ఆమె కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
అయితే లాహౌల్-స్పితిలో 70 శాతం మంది బౌద్ధమతం అనుసరించే వారు జీవిస్తున్నారు. గతంలో కంగనా రనౌత్ టిబెటియన్ మత గురువైన దలైలామా, యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్ పక్కన ఉన్న ఫోటోను షేర్ చేయగా అందులో దలైలామా వివాదాస్పద రీతిలో ఎడిట్ చేయబడి ఉండటంతో కాంట్రవర్సీయల్ అయింది. ఆ తర్వాత కంగనా క్షమాపణలు కూడా చెప్పింది. ఇటీవల కంగనా దలైలామాను కూడా కలుసుకుంది. తాజాగా నిరసనలకు దలైలామా విషయంలో కంగనా గతంలో చేసిన వివాదాస్పద ట్వీట్ కారణం అని వార్తలు వినిపిస్తున్నాయి.