ఈసారి ఇండియా టి20 ప్రపంచ కప్ విజేతగా నిలుస్తుందని మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ విశ్వాసం వ్యక్తంచేశాడు. అతడు ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ”ప్రపంచకప్‌లలో ఇండియా ఆడుతుంటే చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ, రోహిత్ శర్మ అనుభవజ్ఞుడైన ఆటగాడు. అతడికి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు అని అన్నారు. ఇండియా ఈసారి విజయంతో తిరిగి వస్తుందని నమ్ముతున్నా. చాహల్,శివం దుబే, సంజూ సాంసన్ కు తగిన అవకాశాలు లభించాయి. వారిని జట్టులో చూసి చాలా సంతోషంగా అనిపించింది. టీమ్ ఇండియా చాలా సమతౌల్యంగా ఉంది” అని తెలిపారు.
విరాట్ మరోసారి ప్రపంచకప్‌లో విజృంభిస్తాడని ,గత ప్రపంచకప్‌ల్లో కూడా అతడు రాణించిన విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. ”ఈసారి జట్టు విజయాల్లో రోహిత్ శర్మ తోపాటు.. విరాట్ కోహ్లీ, బుమ్రా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఛేజ్ మాస్టర్‌గా పేరున్న కింగ్ విరాట్ కోహ్లీ మైదానంలో ఉంటేనే.. ప్రత్యర్థి జట్టు ధైర్యం కోల్పోతుంది. ఇక 3 ఫార్మాట్లలో బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్. ఇండియా కప్పు గెలవాలంటే అతడు ముఖ్య భూమిక పోషించాలి” అని అన్నారు.