అధికారంలోకి రాగానే ఆర్డీఎస్‌తో సాగు నీళ్లు అందిస్తాం : బండి సంజ‌య్ హామీ

-

తెలంగాణ రాష్ట్రంలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీయే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ హామీ ఇచ్చారు. ఆర్డీఎస్ కు 15 టీఎంసీల సాగు నీటిని కేటాయిస్తామ‌ని అన్నారు. ల‌క్ష ఎగ‌రాల వ‌ర‌కు నీటిని అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. కాగ బండి సంజ‌య్.. గ‌ద్వాల జిల్లాలో కొన‌సాగిస్తున్న ప్ర‌జా సంగ్రామ యాత్ర నాలుగో రోజుకు చేరింది. ఈ రోజు వ‌ల్గూరు నుంచి 13 కిలో మీట‌ర్లు పాద‌యాత్ర సాగింది. కాగ ఈ పాద‌యాత్ర‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై బండి సంజ‌య్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

అవ‌ర‌సం అయితే.. చివ‌రి అయ‌క‌ట్టు ప్రాంతాంల్లో కొత్త‌గా ఎత్తిపోత‌ల ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేస్తామ‌ని అన్నారు. అలంపూర్ నియోజ‌క వ‌ర్గాన్ని స‌స్య శ్యామలంగా మారుస్తామ‌ని హామీ ఇచ్చారు. గోదావ‌రి నుంచి కేసీఆర్ ఫామ్ హౌజ్ వ‌ర‌కు నీళ్లు తెచ్చారు.. కానీ ఆర్డీఎస్ కు క‌నీసం రూ. 75 కోట్లు ఖ‌ర్చు చేయాల‌ద‌ని విమ‌ర్శించారు. రైతులు సొంతంగా లిఫ్ట్ పెట్టుకుంటామ‌ని కోరినా.. అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని మండిప‌డ్డారు. స‌మైక్య పాల‌న‌లో ప్ర‌జ‌లకు జ‌రిగిన ద్రోహం కంటే.. ఎక్కువ కేసీఆర్ ఇప్పుడు చేస్తుండ‌ని అగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news