ఇండియాలో దుకాణం మూసేస్తున్న పబ్జీ మొబైల్..

వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారన్న కారణంగా చైనాకి చెందిన చాలా కంపెనీల మొబైల్ యాప్స్ పై ఇండియా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ విధంగానే పబ్జీ మొబైల్ పై నిషేధం విధించింది. ఇండియాలో ఎక్కువ మంది ఆడుతున్న ఈ మొబైల్ గేమ్ గురించి అందరికీ తెలుసు. ఐతే సెప్టెంబర్ 2వ తేదీన భారత ప్రభుత్వం పబ్జీ మొబైల్ ని నిషేధించింది. నిషేధం గురించిన ప్రకటన వచ్చిన తర్వాత కూడా పబ్జీ మొబైల్ చాలామందికి అందుబాటులో ఉండింది.

తాజా సమాచారం ప్రకారం పబ్జీ మొబైల్ తన సేవలన్నింటినీ నిలిపివేయనుంది. నేటి నుండి లేదా అక్టోబర్ 30వ తేదీ  ఇండియాలో పబ్జీ సేవలన్నింటినీ ఆపేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. పబ్జీకి సంబంధించి ఎలాంటి సేవలు కూడా అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. మొత్తానికి ఇండియాలో ఎక్కువ మంది ఆడుతున్న గేమ్ షో ఇక నుండి ఇండియాలో అందుబాటులో ఉండదన్నమాట.