ఆ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ పై ₹300 సబ్సిడీ

-

మధ్య తరగతి ప్రజలకు గుది బండలా మారిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ  పుదుచ్చేరి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెరుగుతున్న గ్యాస్​ ధరలతో ఇబ్బంది పడుతున్న.. ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​పై రూ.300 సబ్సిడీని అందిస్తామని పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్​ రంగస్వామి ప్రకటించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్​లో ప్రకటించారు.

రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు ఒక సిలిండర్​పై రూ.300 సబ్సిడీ అందిస్తామని పేర్కొన్నారు. ఈ పథకానికి బడ్జెట్​లో రూ. 126 కోట్లు కేటాయించామని రంగస్వామి తెలిపారు. నిరుగ్యోగులకు ఉపాధి కల్పించడానికి.. రూ. 100 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిన పరిశ్రమలకు సబ్సిడీ ఇస్తామని ముఖ్యమంత్రి రంగస్వామి వెల్లడించారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రూ. 11,600 కోట్ల వార్షిక బడ్జెట్​ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

త్వరలో వివిధ దేశాలకు చెందిన తమిళ పండితుల భాగస్వామ్యంతో ప్రభుత్వం ‘ప్రపంచ తమిళ సదస్సు’ను నిర్వహిస్తామని పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news