అభిమానులకు షాక్ ఇచ్చిన పునర్నవి.. అసలు విషయం ఇది..!

ఉయ్యాల జంపాల అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన పునర్నవి ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించిన విషయం తెలిసిందే. అందరికీ సుపరిచితులు గా మారిపోయింది. అయితే ఇటీవలే తనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు చేతికి రింగ్ ధరించి ఉన్న ఒక ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది పునర్నవి భూపాలం. దీంతో మొన్నటివరకు రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి కి పెళ్లి జరుగుతుంది అని అనుకున్న అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.

ఇక ఆ తర్వాత బిగ్ సర్ప్రైజ్ ఇస్తాను అంటూ పునర్నవి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఆ బిగ్ సర్ప్రైస్ ఏమై ఉంటుందని అభిమానులు అందరూ అయోమయంలో మునిగిపోయారు. అంతే కాదు నేను ఎస్ చెప్పాను అంటూ సోషల్ మీడియాలో ఒక కామెంట్ కూడా పెట్టింది పునర్నవి. కానీ పునర్నవి ఇదంతా చేస్తుంది కేవలం తన వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమే అన్నది అర్ధమవుతుంది. పునర్నవి భూపాళం ఉద్భవ్ ప్రధాన పాత్రలో కమిట్ మెంటల్ అనే వెబ్ సిరీస్ వచ్చే నెల 13 నుంచి ప్రారంభం కానుంది ఇక దీని ప్రమోషన్ లో భాగంగానే తాను అలా పోస్ట్ పెట్టాను అంటూ పునర్నవి ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది.