పవన్‌ కల్యాణ్‌ కు జోడీగా హైబ్రీడ్‌ పిల్ల…!

పవన్‌కల్యాణ్‌ పక్కన ఇప్పటివరకు గ్లామర్ హీరోయిన్స్‌ మాత్రమే కనిపించారు. ఓ 10 సీన్స్‌లో కలిసి నటించి.. నాలుగు పాటల్లో స్టెప్పులేసే భామలనే పవన్ పక్కన చూశాం. అయితే.. రీసెంట్‌గా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సినిమాలో అలా కాదు. గ్లామర్‌ లేకుండా.. పెర్‌ఫార్మెన్స్‌తో పవర్‌స్టార్‌ను డామినేట్ చేయనుంది ఓ హీరోయిన్‌.


అయ్యప్పనమ్‌ కోషియం రీమేక్‌లో పోలీస్‌గా నటించనున్నారు పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి పేరు వినిపిస్తుంది.పెర్‌ఫార్మెన్స్‌తో ఇంప్రెస్‌ చేసే హైబ్రీడ్‌ పిల్లను ఈ మూవీకి లాక్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో హై ఓల్టేజ్ పోలీస్ ఆఫీసర్ రోల్ తో పవన్ కళ్యాణ్ నటించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో సాయి పల్లవిని తీసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మలయాళ వర్షన్ లో ఆ పాత్రకు ఇంపార్టన్స్ ఉన్నప్పటికీ నిడివి మాత్రం తక్కువగా ఉంటుంది. కానీ తెలుగులో మాత్రం ఆ పాత్ర నిడివి పెంచబోతున్నారని సమాచారం.