ఆగష్టు ఒకటవ తేదీన తిరుపతి జిల్లా పుంగనూరు లో జరిగిన హింసాత్మక ఘటన గురించి రాష్ట్రము అంతా తెలిసిందే. ఆరోజున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అవసరం లేకున్నా పుంగనూరు ఊరిలోకి ప్రవేశించి టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పి పోలీసులు మరియు సామాన్యులపై కర్రలు మరియు రాళ్లతో దడి చేయించారన్నది వైసీపీ నాయకులు మరియు పోలీసులు చెబుతున్న మాట. ఈ ఘటనలో ఎందరో అమాయకులు గాయాలపాలయ్యారు మరియు పోలీసులు సైతం గాయాలతో బాధపడ్డారు. ఇక ఈ ఘాతంబాకు ప్రధాన నింధితుడిగా చల్లా బాబు గా గుర్తించి పోలీసులు కేసును నమోదు చేశారు, దాదాపుగా ఒక నెల రోజులు ఇతని గాలించగా ఎక్కడా దొరకలేదు. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ రోజు ఇతను పోలీసులకు సురేందర్ అయ్యారు. ఇక ఈ కేసులో నిందితులుగా ఉన్న దేవినేని ఉమ, పులివర్తి, కిషోర్ లు ఇప్పటికే ముందస్తు బెయిల్ ను తీసుకున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలలు మాత్రమే సమయం ఉన్నందున వైసీపీ, టీడీపీ, జనసేనలు ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.