“మహారాష్ట్ర డిప్యూటీ సీఎం క్షమాపణలు” 

-

మహారాష్ట్ర లోని జల్నా ప్రాంతానికి చెందిన ఒక వర్గం మరాఠీలు రిజర్వేషన్ ను కల్పించాలని కోరుతూ నిరసన చేయడం జరిగింది. కాగా ఈ నిరసనను ఆపివేయాలంటూ మహారాష్ట్ర పోలీసులు ఆ నిరసన కారులపై లాఠీ ఛార్జ్ చేశారు. కానీ ఆ తర్వాత పోలీసులు వారిని నియంత్రించడానికి మాత్రమే మేము లాఠీ ఛార్జ్ చేశాము అంటూ చెప్పారు. కానీ ఈ విషయం ప్రభుత్వానికి తలనొప్పిగా ఎక్కడ మారుతుందో అని ఆలోచించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్  నిరసనకారులపై జరిగిన లాఠీ ఛార్జ్ గురించి చింతిస్తూ ఇందుకు పూర్తి బాధ్యత మాదేనని ఒప్పుకుంటూ క్షమాపణలు చెప్పారు. నిరసనకారులపై లాఠీ ఛార్జ్ చేయడం కరెక్ట్ కాదు.. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుని వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అవుతోంది. ఇక ఈ విషయంలో వాస్తవం ఏమి జరిగినదన్నది తెలియాల్సి ఉంది..
ఇంకా నిరసనకారులు అడిగిన మరాఠీల రిజర్వేషన్ విషయంపై ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news