గత కొన్ని రోజులుగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో కలహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు అయితే ఎప్పుడు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలుతున్న అనే ప్రశ్న కూడా అందరిలోనూ మెదిలింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం… రంగంలోకి దిగడంతో… కాస్త చల్లబడ్డాయి పంజాబ్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు. అయితే తాజాగా మరోసారి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్… మరియు పంజాబ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధూ మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
వారిద్దరి మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాను సీఎంగా కొనసాగే కాబోనని అమరిందర్ సింగ్ స్పష్టం చేసినట్లు సమాచారం అందుతోంది. ఇవాళ పంజాబ్ రాజధాని చండీగఢ్ లో జరిగే సీఎల్పీ భేటీకి ముందే ఆయన తన రాజీనామాను ప్రకటించనున్నట్లు సమాచారం అందుతోంది. రాజీనామా లేఖను సాయంత్రం ఆ రాష్ట్ర గవర్నర్ కు పంపించేందుకు సీఎం అమరిందర్ సింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీఎల్పీ భేటీ లో కొత్త నేత ను ఎన్నుకునే యువజన లో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం అందుతోంది. అంతేకాదు సీఎం అమరిందర్ సింగ్ వెంట ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం లోగా దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.