కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వివాదాస్పద వ్యవసాయ బిల్లును వెనక్కు తీసుకోవటానికి పంజాబ్ రైతులు ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఒక బాధాకరమైన వార్త బయటకొచ్చింది. ఈ ఆందోళనలో పాల్గొంటున్న ఒక రైతు కుమారుడు భారత దేశం కోసం పోరాడుతూ బోర్డర్ వద్ద ప్రాణం విడిచాడు. ఆయన ఇండియన్ ఆర్మీ కోసం పని చేస్తున్నారు.
శుక్రవారం ఉదయం, పంజాబ్ రైతులు చలో ఢిల్లీ కవాతుకు సిద్ధమవుతుండగా, పంజాబ్‌లోని తార్న్ తరణ్ జిల్లాకు చెందిన కుల్వంత్ సింగ్ అనే రైతుకు తన కుమారుడు అమరుడయినట్టు తెలియజేస్తూ సైన్యం నుండి కాల్ వచ్చింది. 18 జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్‌కు చెందిన రైఫిల్మన్ సుఖ్‌బీర్ సింగ్ వయసు కేవలం 22 సంవత్సరాలు. ఆర్మీలో జాయిన్ అయిన ఆయన ఒక సంవత్సరం మరియు 11 నెలలు మాత్రమే డ్యూటీ చేశాడు. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద విధులలో ఉన్న ఆయన సరిహద్దు కాల్పుల్లో నాయక్ ప్రేమ్ బహదూర్ ఖాత్రితో పాటు తీవ్ర గాయాల పాలయి మరణించాడు.