కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభం కారణంగా… నిరుపేదలకు ఉచితంగా అందిస్తున్న రేషన్ ను తొలగించే ఆలోచన లేదని… కీలక ప్రకటన చేసింది మోడీ సర్కార్. కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థ కోల్పోవడంతో గత ఏడాది మార్చి నుంచి అందిస్తున్న ఉచిత రేషన్… నవంబర్ 30వ తేదీ తర్వాత… తొలగించ బొమని కుండబద్దలు కొట్టింది కేంద్ర ప్రభుత్వం.
ఈ పథకం కింద అర్హులైన 80 కోట్ల మందికి పైగా ప్రజలకు నెలకు 5 కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు, కుటుంబానికి ఒక కేజీ శనగలు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం అందించింది. అయితే నవంబర్ 30వ తేదీ తర్వాత ఈ ఉచిత రేషన్ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దీంతో చాలామంది నిరుపేదలకు.. ఊహించని షాక్ తగిలింది. కాగా దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ పై వ్యాట్ ను తగ్గించిన సంగతి తెలిసిందే. ఇంకా ఇవాళ వంటనూనెల పై కూడా టాక్స్ లను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం.