నిన్న కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడానికి ఒక ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది. ప్రత్యేక సమావేశాల పేరుతో అయిదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును తీసుకురావాలని ఆలోచించారు. కానీ ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందన్నది ఎవ్వరూ ఊహించలేని పరిస్థితి. అందుకే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్రమైన విచారణ జరిగి రిపోర్ట్ ను అందించాలని సూచించారు. దీనిపై దేశ వ్యాప్తంగా వివిధ రకాలుగా స్పందనలు వస్తున్నాయి. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేసారు. జమిలీ ఎన్నికలు కనుక వస్తే దేశమైన ఎలక్షన్ ల పేరుతో పడే అదనపు ఖర్చులు తగ్గుతాయని పురందేశ్వరి తెలిపింది. ఇంకా రక్షక దళాలపైన కూడా ఒత్తిడి తగ్గతుందని అంటూ తన అభిప్రాయాన్ని పురందేశ్వరి చెప్పారు.
ఇక ముందు ముందు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది.