సీఎం జగన్‌ను కలిసిన యూనిసెఫ్‌ ఫీల్డ్‌ ఆఫీస్‌ చీఫ్‌

-

సీఎం వైఎస్‌ జగన్‌ను యూనిసెఫ్‌ ఫీల్డ్‌ ఆఫీస్‌ చీఫ్‌ (ఏపీ, కర్ణాటక, తెలంగాణ) డా. జెలాలెం బి. టాఫెస్సే కలిశారు. ఈ సందర్భంగా.. గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా వైద్య, ఆరోగ్యరంగంలోని వివిధ స్ధాయిల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్దత వ్యక్తం చేసిన యూనిసెఫ్‌ చీఫ్‌.. ప్రైమరీ హెల్త్‌ కేర్‌లో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ (ఎంఎల్‌హెచ్‌పీలు), ఫ్యామిలీ ఫిజీషియన్, ఆశా, అంగన్‌వాడీ వర్కర్స్, ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ సెంటర్స్‌ వంటి వివిధ స్ధాయిల్లో ప్రభుత్వానికి అవసరమైన విధంగా తోడ్పాటు ఇచ్చేందుకు ముందుకొచ్చింది.

UNICEF : జగన్‌ను కలిసిన యూనిసెఫ్‌ ఫీల్డ్‌ ఆఫీస్‌ చీఫ్‌ డా. జీలాలెమ్ బి.  తాప్సీ | unicef unicef field office chief dr zeelalem b taapsee cm jagan

వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు యూనిసెఫ్‌ బృందంతో చర్చించిన సీఎం వైఎస్‌ జగన్.. సుస్ధిరాభివృద్ది లక్ష్యాల సాధనలో ముందుకెళుతున్న తీరును వివరించారు. దీంతో.. యూనిసెఫ్‌ చీఫ్‌ అభినందించారు. చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వారికి అందజేస్తున్న పౌష్టికాహారం, యాక్షన్‌ ప్లాన్, మహిళా రక్షణ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పర్యవేక్షణ, మహిళా పోలీసుల ద్వారా మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను అరికట్టడం వంటి కీలక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామని యూనిసెఫ్‌ టీమ్‌ తెలిపింది. ఆరోగ్య సురక్ష పేరుతో త్వరలోనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు యూనిసెఫ్‌ ప్రతినిధులకు సీఎం జగన్‌ తెలిపారు. చైల్డ్‌ మ్యారేజ్‌ ఫ్రీ స్టేట్‌గా ఏపీని తీర్చిదిద్దినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news