మార్గ నిర్దేశనం కోసం ఉపయోగించే గూగుల్ మ్యాప్ ఒక్కోసారి ప్రాణసంకటంగా మారుతోంది. ఒక్కోసారి మ్యాప్స్ తీసుకెళ్లే మార్గం చావుకు చాలా దగ్గరగా ఉంటోంది. గతంలో మ్యాప్‌ను నమ్ముకుని అడవిలో దారి తప్పిన ఘటనలు, నదిలోకి కార్లు దూసుకెళ్లిన ఘటనలు , కొండ ప్రాంతం నుంచి కింద పడి మరణించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఒక్కోసారి ఖచ్చితత్వంతో దారిని చూపించే గూగుల్ మ్యాప్స్ కొన్ని సందర్భాల్లో దారుణంగా ఫెయిల్ అవుతోంది. కారణం ఏదైనా మనిషి ప్రాణాలు రిస్కులో పడుతున్నాయి.
తాజాగా ఏపీలో గూగుల్ మ్యాప్‌ను నమ్మి వెళ్లిన తల్లీకొడుకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.వివరాల్లోకివెళితే.. ఏపీలోకి నున్నకు చెందిన గౌతమ్ సొంతూర్లో వరదలు రావడంతో 10 రోజులుగా పక్క ఊరిలోని బంధువుల ఇంట్లో ఉంటున్నాడు.శుక్రవారం వరద తగ్గిందని ఇంటికెళ్లి కారులో తల్లిని తీసుకుని మ్యాప్ ఆధారంగా విజయవాడకు బయలుదేరాడు. అది సావరగూడెం-కేసరపల్లి మీదుగా దారి చూపించింది. ఆ మార్గంలో భారీ వరద ఉండటంతో కారు ప్రమాదంలో చిక్కుకుంది. వెంటనే స్థానికులు ధైర్యం చేసి తల్లి కొడుకును ప్రాణాలతో కాపాడారు.