ఒకే ట్రాక్ పైకి వచ్చిన రెండు రైళ్లు.. ఫైర్ అవుతున్ననెటిజన్లు

-

భారతీయ రైల్వేలో ఇటీవల వరుసగా లోపాలు బయటపడుతున్నాయి. గతంలో ఉన్న సేఫ్టీ కంటే ఇప్పుడు టెక్నాలజీ సాయంతో ఇండియన్స్ రైల్వేస్ మౌలిక సదుపాయాలను మెరుగ్గా కల్పిస్తోంది. సూపర్ ఫాస్ట్ ట్రెయిన్స్, బుల్లెట్ ట్రెయిన్స్‌ను తీసుకొచ్చేందుకు సిద్దం అయ్యింది. ప్రస్తుతం వందేభారత్ రైళ్ల హవా నడుస్తోంది. రైల్వేను పూర్తిగా ఆధునీకరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే, సరికొత్త టెక్నాలజీని రైల్వో ప్రవేశపెడుతున్నా చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ప్రజలకు రైల్వేల మీద ఉన్న నమ్మకం పోయేలా ఉంది.

ఇప్పటికే చాలా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తరుచుగా రైళ్లు పట్టాలు తప్పడం, అగ్రిప్రమాదాల బారిన పడటం జరుగుతోంది. ఇందుకు గల కారణాలపై రైల్వే విచారిస్తున్నా సమాధానం మాత్రం ఇంకా దొరకలేదు. ఈ క్రమంలోనే రైల్వే శాఖ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఒడిశాలోని పూరి-జలేశ్వర్, కియోంజర్-ఖుర్దా మద్య నడిచే లోకల్ ట్రైన్స్ ఎదురెదురుగా వచ్చాయి. చివరిక్షణంలో పెను ప్రమాదమే తప్పింది. అయితే, దారి మళ్లింపుకోసం వేరే ట్రాక్ కూడా లేదు. దీంతో సింగిల్ ట్రాక్ ఉన్న మార్గాల్లో రైల్వే అధికారులు అప్రమత్తంగా ఉండాల్సింది పోయి నిర్లక్ష్యంగా ఎలా ఉంటారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version