కష్టాలు గుర్తు తెచ్చుకుని బాధపడేవారి గురించి పూరీ జగన్నాథ్ చెప్పిన మాటలు విని తీరాల్సిందే..

-

ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరూ తమకి బాధలు రాకూడదనే కోరుకుంటారు. ఏ బాధా లేకుండా కాలం వెళ్ళదీస్తే చాలనుకుంటారు. కానీ వాళ్ళెంతలా అనుకున్నా బాధల్లేకుండా, బాధపడకుండా జీవితాన్ని దాటలేరు. జీవితంలో కష్టాలు రావాలి. కన్నీళ్ళు కార్చాలి. అప్పుడే మనం స్ట్రాంగ్ అవుతాం. జిమ్ కి వెళ్తే శరీరం స్ట్రాంగ్ అయినట్టు, కష్టాలొస్తే మనసు స్ట్రాంగ్ అవుతుంది.

ఐతే చాలామంది తాము పడిన కష్టాలని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు. అప్పుడు తినడానికి అన్నం లేదనీ, చాలా కష్టపడ్డానని బాధపడతారు. అప్పుడెప్పుడో జరిగిన దానికి ఇప్పుడు బాధపడవద్దు. నీకే కాదు ఇక్కడ అందరికీ కష్టాలు ఉన్నాయి. నువ్వు సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాలో వచ్చిన సీన్ కే బాధపడాలి. అంతేగానీ, ఒక సినిమా చూస్తూ అప్పుడెప్పుడో ఫలానా సినిమాలోని ఫస్టాఫ్ లో ఫస్ట్ సీన్ గురించి బాధపడవద్దు. జరిగిపోయిన వాటిని తల్చుకుని బాధపడుతూ ఎంటర్ టైన్ అవ్వకండి.

బుర్రలేని వాడు నవ్వితే అందులో పెద్ద ఫీలింగ్ ఉండదు. అదే యుద్ధం చేసి వచ్చిన వీరుడి చిరునవ్వులో అంతుచిక్కని ఆనందం ఉంటుంది. బాగా కష్టాలు పడ్డవారు మాత్రమే బాగా నవ్వగలరు. వారి నవ్వులో ఏదో అంతరార్థం ఉంటుంది. అది ఎదుటివారికి ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ నవ్వు అలాగే ఉండాలి. అలా ఉండాలంటే కష్టాలు పడాలి. పని చేయాలి. అవమానాలు ఎదుర్కోవాలి.

జీవితంలో వచ్చే కష్టాలన్నింటినీ ఎంత తొందరగా చూసేస్తే అంత మంచిది. అప్పుడు మీరింకా స్ట్రాంగ్ గా తయారవుతారు. అందుకే గతాన్ని తల్చుకుని ఎప్పుడూ బాధపడకండి అని పూరీ జగన్నాథ్ మాట్లాడాడు.

Read more RELATED
Recommended to you

Latest news