మీ రేషన్ కార్డు పెండింగ్‌లో ఉందా..?. ఇవి ఉంటే కచ్చితంగా రాదు..!

-

హైదరాబాద్: తెలంగాణలో రేషన్ కార్డు కోసం అప్లై చేశారా?. కార్డు మంజూరు చోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారా?. మీకు అసలు రేషన్ కార్డు వస్తుందా?. రాదా? అనే ఆలోచనలా ఉన్నారా?. అయితే ఇవి తెలుసుకోండి.

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే రెడీ అయిన విషయం తెలిసిందే. మొత్తం 4.97 లక్షలకు పైగానే కొత్త రేషన్ కార్డులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించింది. దీంతో అర్హులు, అనర్హుల కోసం జల్లెడ పడుతోంది. కొత్త విధానంతో అనర్హులను గుర్తించేందుకు ప్రక్రియ ప్రారంభించింది.

ఈ ప్రక్రియలో అర్హులని తేలితేనే రేషన్ కార్డులు ఇస్తారు.?. లేదంటే తిరస్కరిస్తారు. చాలా మంది రేషన్ కార్డు ఉన్న వారు సబ్సిడీ బియ్యం తీసుకోవడంలేదు. కానీ ప్రభుత్వ పథకాలకు మాత్రం ఉపయోగించుకుంటున్నారు. దీంతో రేషన్ తీసుకోని వాళ్లను గుర్తించి అనర్హుల జాబితాలో చేర్చింది. అయితే కొంత వ్యతిరేకత రావడంతో ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.   ఇక కొత్త రేషన్ కార్డుల పరిశీలన ప్రక్రియను ఈ నెల 25లోపు పౌరసరఫరాల శాఖ అధికారులు పూర్తి చేస్తారు.

ఇప్పటికే అధికారులు పాత, కొత్త రేషన్ కార్డుల్లో అనర్హులను గుర్తించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పాత రేషన్ కార్డుదారుల్లో  కారు ఉన్నా, ఐటీ టాక్స్ కడుతున్నా, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, పింఛన్ తీసుకుంటున్నా వారికి అనర్హులుగా గుర్తించి కార్డును తొలగించారు. ఇక ఇదే విధానాన్ని కొత్తగా మంజూరు చేయబోయే రేషన్ కార్డు దరఖాస్తుదారులకు కూడా ఇవే షరతులు వర్తిస్తాయని అంటున్నారు.

ఆధార్ కార్డుల ఆధారంగా కొత్త రేషన్ కార్డులకు అర్హులా, అనర్హులను నిర్ణయిస్తారు. ఎన్ఐసీ, ఐటీ తదితర శాఖల ద్వారా ‘360’డిగ్రీలు అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు.  ఈ విధానం ద్వారా ఇన్‌కమ్ ట్యాక్స్ కడుతున్న వారి వివరాలను గుర్తించారు. అనర్హులను గుర్తించి రేషన్ కార్డును తిరస్కరిస్తారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఈ ప్రక్రియ ప్రారంభించారు. మొత్తం 95 వేల దరఖాస్తులను ఐటీ శాఖకు పంపారు. అక్కడ నుంచి సమాచారం అందిన వెంటనే కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news