ఏపీలో కరోనా నిలువునా వణికిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ రేటు ఏకంగా 20శాతం దాటిపోయింది. కేవలం 10శాతం ఉంటేనే సంపూర్ణలాక్‌డౌన్ పెట్టాలని ఐసీఎంఆర్ చెబుతోంది. మరి దానికి డబుల్ రేటు పాజిటివ్ కేసులు వస్తున్నా సంపూర్ణలాక్‌డౌన్ ఎందుకు పెట్టట్లేదనే ప్రశ్నలు తీవ్రంగా వస్తున్నాయి. అయితే రాష్ట్రంలో మధ్యామ్నం 12గంటల నుంచి ఉదయం 6గంటల వరకు లాక్‌డౌన్ ఉన్నా కేసులు ఏమాత్రం తగ్గట్లేదు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు, ప్రజల నుంచి కూడా లాక్‌డౌన్ పెట్టాలనే డిమాండ్ వస్తోంది.
రాష్ట్రంలోని 11జిల్లాల్లో పాజిటివ్ రేటు ఆల్రెడీ 20శాతం దాటిపోయింది. ఇక అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇంకోవైపు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేలో సంచలన నిజాలు బయటపడుతున్నాయి.
గ్రామాల్లో సగం మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు ఆరోగ్య సిబ్బంది గుర్తించారు. చాలామందికి జ్వరాలు, దగ్గులాంటివి ఉన్నట్టు ఈ సర్వేలో తెలిసింది. మరి పరిస్థితులు ఇంత భయంకరంగా ఉన్నా సీఎం జగన్ సంపూర్ణలాక్‌డౌన్ ఎందుకు అమలు చేయట్లేదు. చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో కూడా సంపూర్ణ లాక్‌డౌన్ ఉంటే ఏపీలో ఎందుకు పెట్టట్లేదనే డిమాండ్ వస్తోంది. మరి ఇప్పటికైనా లాక్‌డౌన్‌పై ప్రభుత్వం ఆలోచిస్తుందో లేదో చూడాలి.