ఒరిస్సా.. తెరుచుకున్న పూరీ జగన్నాథ ఆలయం.. వారికి మాత్రమే అనుమతి.

-

కరోనా తాకిడికి దేవాలయాలు కూడా మూతపడ్డాయి. దేవుడు సమస్యలు తీరుస్తాడని నమ్మే భక్తులకు తమ గోడు వెల్లబోసుకోవడానికి కూడా దేవాలయం వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. ఐతే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గింది. దాంతో ఇప్పుడిప్పుడే సుప్రసిద్ధ దేవాలయాలు తెరుచుకుంటున్నాయి. ఒరిస్సాలోని పూరీ జగన్నాథ దేవాలయం తెరుచుకుంది. సెకండ్ వేవ్ కారణంగా మూడు నెలల పాటు మూసి ఉన్న దేవాలయం నిన్న తెరుచుకుంది.

ఐతే తొలిదశలో జగన్నాధుడిని దర్శించడానికి సాధారణ భక్తులకు అనుమతి ఇవ్వడం లేదు. దేవాలయ సేవకులకు, వారి కుటుంబాల వారికి జగన్నాధుడిని దర్శించుకునేందుకు అనుమతులు ఇస్తున్నారు. ఈ నెల 23నుండీ సామాన్య భక్తులకు కూడా దర్శనానికి అనుమతులు ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో చాలామంది భక్తులు పూరీ జగన్నాధుడిని దర్శించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. మొత్తానికి దేశంలోని ప్రముఖ దేవాలయాలు భక్తుల కోసం సందర్శనార్థం ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news