రెండేళ్ల తరువాత జగన్నాథుడి రథయాత్ర..

-

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్రకు ఎంత విశిష్టత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రథయాత్రకు దేశనలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు తరలివస్తుంటారు. అయితే.. ఈ ఏడాది రథయాత్ర శుక్రవారం ప్రారంభం కానుంది. ఇందులో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి ఇప్పటికే వేలాదిగా భక్తులు పూరీ జగన్నాథ ఆలయానికి చేరుకున్నారు. ఈ యాత్ర తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. సోదరుడు భలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు రథయాత్రతో భక్తులకు దర్శనం ఇస్తాడు. రెండు సంవత్సరాల తర్వాత ఈ యాత్రకు పూర్తి స్థాయి భక్తులను అనుమతిస్తున్నారు. దాంతో, ఒడిశా అంతటా భక్తుల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. కొవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లు రథయాత్రకు భక్తులను అనుతించలేదు.

Breaking] SC Allows Jagannath Rath Yatra At Puri On Conditions [Read Order]

రెండేళ్ల విరామం తర్వాత రథయాత్రలో పాల్గొనేందుకు ప్రజలను అనుమతించడంతో సుమారు 10 లక్షల మంది తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర మతాల వారు, జగన్నాథ ఆలయంలోకి ప్రవేశం లేని విదేశీయులు కూడా త్రిమూర్తుల దర్శనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఒక అధికారి తెలిపారు. రథయాత్ర సజావుగా సాగేందుకు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పూరీ, చుట్టుపక్కల వెయ్యి మంది పోలీసులను, 180 ప్లాటూన్ల సాయుధ బలగాలను మోహరించారు. పూరీలోని గ్రాండ్ రోడ్, ఇతర ప్రదేశాలలో దాదాపు 50 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news