భారత దేశంలోనే ఎంతో ప్రసిద్ధి గాంచిన క్షేత్రం పూరీ జగన్నాథ్ ఆలయం. నేడే పురి జగన్నాథుడి రథయాత్ర..! ప్రతీ సంవత్సరం పురి జగన్నాథుడి రథయాత్రను వీక్షించేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు, కానీ ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా ఈ కన్నులపండుగ కేవలం 1500 మందితో ముగిసింది. గత కొన్ని రోజులుగా రథయాత్ర గురించి అటు కేంద్రం తరఫున మరియు సుప్రీం తరఫున న్యాయస్థానంలో అనేక వాధానాలు జరుగుతున్న నేపద్యంలో సుప్రీం ఈ వేడుకను గూర్చి లోతైన విశ్లేషణ చేసేందుకు వేడుక సాఫల్యం గురించి స్టడీ చేసేందుకు ముగ్గురు న్యాయనిర్ణేతలతో కూడిన బెంచ్ ని సుప్రీం ఏర్పాటు చేసింది. అనేక వాధానాలు విన్న న్యాయస్థానం ఈ వేడుకను జరిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, కాగా కొన్ని కండిషన్లతో జరపాలని ఆంక్షలు విధించింది.
ప్రతీ సంవత్సరం ఈ వేడుక ను జరపడానికి ఆ ప్రాంతం రాజకుటుంబానికి, రథయాత్రలో పాల్గొనవలసిన 600 కుటుంబాలకు రథాన్ని లాగే 1500 మందికి అనుకూలత ఉంటుంది, పైగా లక్షాలాదిమంది భక్తుల సమక్షంలో ఈ వేడుక జరుగుతుంది. కానీ కోవిడ్ కారణంగా ఈసారి సుప్రీం కేవలం 1500 మందిని మాత్రమే అనుమతించింది. రథయాత్రలో ఒకటి స్వామి వారి రథం మరో రెండు రథాల్లో సుభద్ర, బలభద్ర దేవతా మూర్తులు ఉంటారు, కాగా మూడు రథాలను ఒక్కో రథానికి 500 మంది చొప్పున మొత్తం 1500 మందికి మాత్రమే అనుమతి దొరికింది. ఆ 1500 మందికి కూడా ముందు కోవిడ్ పరీక్షలు చేసిన అనంతరమే అనుమతులు దక్కాయి. ఇలా కేవలం 1500 మందితో రథయాత్ర జరగడం చరిత్రలో ఇదే మొదటిసారి పైగా ఆఖరిది కూడా అవ్వోచ్చు.