PUSHPA : పుష్ప నుంచి మరో అప్డేట్.. ట్రైలర్ టీజ్ రిలీజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం చేస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు పార్ట్స్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ పాన్‌ ఇండియా మూవీ లో ఐకాన్‌ స్టార్‌ హీరో బన్నీకి జోడీగా శ్రీ వల్లి పాత్ర లో రష్మిక మందనా నటిస్తోంది. చిత్రంలో ఫహద్ ఫాసిల్​, సునీల్​ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే తాజాగా పుష్ప నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 6న విడుదల కానున్న నేపథ్యంలో… ట్రైలర్ టీజ్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఈ ట్రైలర్ లో అల్లు అర్జున్ చాలా పవర్ఫుల్ లుక్లో కనిపించాడు. మొత్తానికి ఈ ట్రైలర్ టీజ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. కాగా పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.