రూ.15 వేల జీతంతో 15 నిమిషాల్లో రుణం: SBI క్విక్ పర్సనల్ లోన్

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలను ఇస్తోంది. దీని వలన కస్టమర్స్ కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలానే లోన్స్ ని కూడా స్టేట్ బ్యాంక్ ఇస్తోంది. మీరు కూడా లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? రూ.15 వేలు జీతం మీకు వస్తోందా..? అయితే మీకు గుడ్ న్యూస్.

 

దేశీ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో SBI సులభంగానే రుణం పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎస్‌బీఐ క్విక్ పర్సనల్ లోన్ బాగా కస్టమర్స్ కి ఉపయోగ పడుతుంది. ఉద్యోగం చేసే వారు ఈ లోన్ కోసం అప్లై చేసుకోచ్చు.  రూ.24 వేల నుంచి రూ.20 లక్షల వరకు లోన్ ని పొందొచ్చు.

తక్కువ వడ్డీ రేట్లు బెనిఫిట్ ఉంది. డైలీ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ వడ్డీ రేటు కూడా వర్తిస్తుంది. తక్కువగానే ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది. పైగా ఏ సెక్యూరిటీ అవసరం లేదు. గ్యారంటర్ లేకుండా లోన్ ని తీసుకోచ్చు. మీరు కనుక లోన్ తీసుకోవాలని అనుకుంటే శాలరీ అకౌంట్ తప్పనిసరి. ఎస్‌బీఐ లేదా మరే ఇతర బ్యాంకుల్లో అయినా శాలరీ అకౌంట్ కలిగి ఉండాలి గమనించండి.

21 నుంచి 58 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు ఈ లోన్ పొందొచ్చు. అదే విధంగా నెలవారీ వేతనం కనీసం రూ.15 వేలు వస్తుండాలి. కనీసం ఏడాది నుంచి అయినా ఉద్యోగం చేస్తుండాలి. అలానే ఆ లోన్ ని 6 నెలల నుంచి 72 నెలలలో క్లియర్ చేసేయాలి. https://www.sbiloansin59minutes.com/home లింక్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. 15 నిమిషాల్లోనే లోన్ గురించి డీటెయిల్స్ ని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news