శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 11 మంది విదేశీ ప్రయాణికులకు కరోనా

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ వణుకుపుట్టిస్తోంది. ఎటు వైపు నుంచి ఒమిక్రాన్ వేరియంట్ వస్తుందోనని భయపడుతున్నారు జనాలు. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ ఎయిర్ పోర్టు లో దిగిన విదేశీ ప్రయాణికులలో 11 మంది కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ రోజు ఒక్క రోజే 7 గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం గమనార్హం.

దీంతో ఇప్పటి వరకు విదేశీయుల నుంచి కరోనా భారీన పడ్డ వారి సంఖ్య 12 కు చేరింది. ఇక పాజిటివ్ వచ్చిన ప్రయాణికులను టిమ్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. ఇందులో 9 మంది UK నుంచి, 1 సింగపూర్ , 1 కెనడా, అమెరికా నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడు ఉన్నాడు. దీంతో వారి నుంచి శాంపిల్స్ సేకరించి జినోమ్ సీక్వెన్స్ కి పంపారు అధికారులు. వారికి ఒకవేళ వారికి ఒమిక్రాన్ వేరియంట్ సోకితే.. మరింత ప్రమాదం పొంచి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తం అయ్యారు.