అల్లు అర్జున్ కోసం రెండవ సారి విలన్ గా వస్తున్న హీరో..

-

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా రేంజిలో పుష్ప అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడో విడుదలయింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపిస్తున్నాడు. ఐతే ఈ సినిమాలో నటించే విలన్ ఎవరనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. ముందుగా తమిళ నటుడు విజయ్ సేతుపతి పేరు వినిపించింది గానీ ఆ తర్వాత విజయ్ తప్పుకున్నాడు.

అప్పటి నుండి విలన్ గా ఎవరు చేస్తున్నారా అనేది అందరికీ అసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం పుష్ప సినిమాలో విలన్ గా తమిళ నటుడు ఆర్య నటిస్తున్నాడని అంటున్నారు. గతంలో అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలోనూ ఆర్య, విలన్ గా కనిపించాడు. ఈ విషయమై అధికారిక సమాచారం రానప్పటికీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విలన్ గా ఆర్య ఒప్పుకుంటే సినిమాకి అదనపు ఆకర్షణ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news