న్యూఢిల్లీ: పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశాభివృద్ధికి పీవీ చేసిన కృషిని దేశం గుర్తుచేసుకుందని తెలిపార. పీవీ గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి అని అన్నారు.
వెంకయ్యానాయుడు మాట్లాడుతూ పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడని, ఆర్థిక సంస్కరణ మార్గదర్శి అని అన్నారు. బముముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులర్పిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. స్వావలంబన, స్వయం సమృద్ధికి పీవీ పెద్ద పీట వేశారని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. దేశ భవిష్యత్తుకు పీవీ బాటలు వేశారన్నారు. మాతృభాషకు పీవీ చాలా ప్రాధాన్యతమిచ్చారని చెప్పారు. పీవీ సేవలను జాతి చిరకాలం గుర్తు పెట్టుకుంటుందని వెంకయ్య స్పష్టం చేశారు.
కాగా పీవీ నరసింహారావు జూన్ 28, 1921లో కరీంనగర్ జిల్లా వంగర గ్రామంలో జన్మించారు. మంథని నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా మొత్తం వివిధ స్థానాల్లో పోటీ చేసి 6 సార్లు ఎంపీగా గెలిచారు. 1996లో నంద్యాల నుంచి ఎంపీగా గెలిచారు. తెలుగు వ్యక్తి ప్రధాని అవుతున్నాడని ఎన్టీఆర్ వీపీకి పోటీగా అభ్యర్థిని నిలబెట్టకపోవడం విశేషం. రాజీవ్ గాంధీ హయాలో 9వ ప్రధానమంత్రిగా పని చేశారు. దేశంలో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలే ఇప్పటికీ దేశంలో కొనసాగుతూనే ఉన్నాయి.