టోక్యో ఒలంపిక్స్ : తైజు చేతిలో పీవీ సింధు ఓటమి

-

టోక్యో ఒలంపిక్స్ లో ఇవాళ మన తెలుగు తేజం పీవీ సింధు మరియు చైనా దేశానికి చెందిన ప్లేయర్ సైజు మధ్య రసవత్తరమైన పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రసవత్తర పోరులో తెలుగు తేజం పీవీ సింధు ఓటమిపాలైంది. చైనాకు చెందిన తై జుయింగ్ చేతిలో పీవీ సింధు ఓడిపోయింది. వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణి… తై జుయింగ్ చేతిలో…. వరుస సెట్లలలో పీవీ సింధు నిరాశపరిచింది. 18-21 మరియు 12-21 తేడాతో పీవీ సింధు ఘోరపరాభవం చవి చూసింది.

మొదట్లో దూకుడుగా ఆడిన పివి సింధు… చైనా ప్లేయర్ తై జుయింగ్ దాటికి తట్టుకోలేకపోయింది. దీంతో చైనా ప్లేయర్ తై జుయింగ్ విజయం ఖరారు అయింది. ఈ విజయం తో తై జుయింగ్ ఫైనల్ బరిలో అడుగుపెట్టింది. అటు పీవీ సింధు ఇంటి దారి పట్టనుంది. కాగా ఎంతో ఆశగా ఎదురు చూసిన అభిమానులకు నిరాశ మిగిల్చింది పీవీ సింధూ. ఇక గత ఒలంపిక్స్ లో సిల్వర్ గెలుచుకున్న విషయం మనకు విధితమే.

Read more RELATED
Recommended to you

Latest news