పుల్లెల వెంకట సింధు ఉరఫ్ పీవీ సింధుకు భారతప్రభుత్వం దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారం అయిన పద్మభూషణ్, బాక్సర్ గా ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్‌కు దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించనున్నదట. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ పురస్కారాలకు అవార్డుల కమిటీకి ప్రతిపాదించిందట. వీరికి తోడుగా క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి మరో తొమ్మిది మంది వివిధ రంగాల్లోని క్రీడాకారులకు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసి ఇదే అవార్డుల కమిటీకి సిపారసు చేసారట.
ప్రతిఏటా గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకుని దేశ అత్యున్నత పురస్కారాలను దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి చేతుల మీదుగా అందిస్తారు. అయితే ఇప్పుడు ప్రతిపాదించిన అవార్డులను కమిటీ పరీశీలించి వారి సేవలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. వీరికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందిస్తారు. అయితే పీపీ సింధు గతంలోనే 2015లోనే పద్మశ్రీ అవార్డును పొందింది. ఇప్పుడు పద్మభూషణ్ అవార్డుకు ప్రతిపాదించారు. గతంలోనూ 2017లోనూ పద్మభూషణ్ అవార్డుకు ప్రతిపాదించినా అవార్డుల కమిటీ తిరస్కరించింది.
పీవీ సింధు ఇంతకుముందే ఓలంపిక్స్‌లో పతకం సాధించింది. దీనికి తోడు ప్రపంచ బ్యాట్మింటన్ పోటీల్లో రెండుసార్లు రన్నర్‌గా, ఈ ఏడాది విన్నర్‌గా నిలిచింది. అయితే ప్రపంచ ఛాంపియన్ షిప్‌ను గెలిచిన పీవీ సింధుకు ఈసారి తప్పకుండా పద్మభూషణ్ అవార్డు వస్తుందని అందరు ధీమాగా ఉన్నారు. ఇక మేరీకోమ్.. ఇప్పటికే తల్లిగా మారిన మేరీకోమ్ పట్టుదలతో బాక్సర్‌గా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప మేరీకోమ్ 2006లో పద్మ శ్రీ, 2013లో పద్మ భూషణ్ పురస్కారాలను అందుకుంది. ఇప్పుడు పద్మ విభూషణ్ పురస్కారం వరిస్తే, చెస్ మాంత్రికుడు విశ్వనాథన్ ఆనంద్ (2007), దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (2008), పర్వతారోహణకులు సర్ ఎడ్మండ్ హిల్లరీ తర్వాత ఈ గౌరవం దక్కించుకున్న అథ్లెట్‌గా మేరీకోమ్ నిలువనుంది.
మేరీకోమ్ ఓవైపు కుటుంబ బాధ్యతలు మోస్తూనే మరోవైపు బాక్సర్ దేశ ప్రతిష్టను ఇనుమడింప చేస్తుంది. పతకాలను అవలీలగా కొల్లగొట్టే ఈ అథ్లేట్ ప్రపంచ బాక్సర్ గా కీర్తి గడిస్తున్నారు. ఇక వీరితో పాటుగా పద్మశ్రీ అవార్డులకు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ మెరుపు తార మానిక బత్ర, మహిళల టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్, మాజీ షూటర్ సుమా షిమ్రోర్, పర్వాతారోహణ కవల సోదరీమణులు తషీ, మాలిక్‌ల పేర్లను క్రీడా మంత్రిత్వ శాఖ సిఫారసు చేసిందట.