భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో సంచలన విజయం అందుకుంది. ఈ విజయంతో మరో సారి ఛాంపియన్గా నిలిచింది పివి సింధు. స్విస్ ఓపెన్ ను తన ఖాతాలో వేసుకుని ప్రపంచ చాంపియన్ గా నిలిచింది పీవీ సింధు.
థాయిలాండ్ క్రీడాకారిని బుసానన్ పై 21-16, 21-08 తేడాతో ఫైనల్లో విజయం సాధించింది పీవీ సింధు. దీంతో స్విస్ ఓపెన్ ఛాంపియన్ గా పీవీ సింధు నిలిచింది. మ్యాచ్ ప్రారంభం నుంచి.. థాయిలాండ్ క్రీడాకారిణిపై సింధు ఆధిపత్యం చెలాయించింది.
దీంతో మొదటి రౌండు అలాగే రెండో రౌండ్ లోనూ 21 పాయింట్లు సాధించి… తెలుగోడి సత్తా చాటింది సింధు. దీంతో ఈ కృషి యల్ మ్యాచ్ లో పీవీ సింధు సునాయాసంగా విజయం సాధించింది. ఇక పీవీ సింధు విజయంపై… ఇండియా కు చెందిన ప్రముఖులు, బ్యాడ్మింటన్ దిగ్గజాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.