PVT04 : నేను రాముడు కాదప్ప రుద్ర కాళేశ్వరున్ని అంటున్న వైష్ణవ్‌ !

-

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే చక్కటి విజయాన్ని అందుకున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ లో వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత విడుదలైన ‘కొండ పొలం’ మూవీకి మంచి టాక్ వచ్చింది. కానీ, బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు.

అటు ‘రంగరంగ వైభవంగా’ సినిమాను ఇప్పటికే పూర్తి చేశాడు వైష్ణవ్‌ తేజ్‌. ఈ క్రమంలోనే పంజా వైష్ణవ్ తేజ్ 4వ చిత్రం ప్రకటించాడు. నాగ వంశీ దర్శకత్వంలో… వైష్ణవ్‌ తేజ్‌ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా PVT04 పేరుతో తెరకెక్కుతోంది.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు ఓ టీజర్‌ ను వదిలింది చిత్ర బృందం. “ఈడ ఉండేడిది రాముడు కాదప్ప ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు!” అనే క్యాప్షన్‌ పెట్టి.. ఈ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ వీడియో చూస్తుంటే.. సినిమా అంచనాలు భారీగానే పెరిగి పోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news