గూగుల్‌ మ్యాప్స్‌ లో మరో అదిరిపోయే ఫీచర్..వారికి బెస్ట్..

-

ఇప్పుడు జనాలు ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నా అడ్రెస్సు లు అడగడంకు బదులుగా గూగుల్ మ్యాప్స్‌ ను వాడుతున్నారు.. రాను రాను ఆ మ్యాప్స్‌ కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ లలో ఈ యాప్ ను వినియోగిస్తున్నారు..జనాలకు మరింత చేరువ అవ్వడానికి గూగుల్ సంస్థ సరి కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.

గూగుల్‌ తాజాగా మ్యాప్స్‌లో మరో ఆసక్తికర ఫీచర్‌ను యాడ్‌ చేసింది. వాహనంలో దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో మధ్యలో టోల్‌గేట్లు వస్తుంటాయి. అయితే టోల్‌ గేట్‌ల వద్ద ఎంత ఛార్జీ వసూలు చేస్తారన్న విషయం మనకు అక్కడికి వెళ్లే వరకు తెలియదు.మనం వెళ్లే దారిలో మొత్తం ఎన్ని టోల్‌ గేట్స్‌ ఉన్నాయి. ఎంత మొత్తం అవుతుంది.? లాంటి విషయాలు తెలిస్తే దాన్ని బట్టి ప్లాన్‌ చేసుకోవచ్చు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే గూగుల్‌ మ్యాప్స్‌లో ఓ ఫీచర్‌ను అందించారు.

భారత్‌తో పాటు అమెరికా, జపాన్‌, ఇండోనేసియా దేశాల్లోని సుమారు 2వేల టోల్‌ రోడ్ల ఛార్జీల వివరాలను మ్యాప్‌లో చూపిస్తాయి.అంతేకాదు.. టోల్‌ గేట్స్‌ను తప్పించుకునే మార్గాలు ఉంటే కూడా గూగుల్‌ మనకు చూపిస్తుంది. ఇక టోల్‌ గేట్స్‌ లేని రోడ్ల ద్వారా ప్రయాణం చేయాలనుకునే వారు ‘అవాయిడ్‌ టోల్స్‌’ ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది..ఈ ఆప్షన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.ఇలా చెయ్యడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి, పడే అవకాశం ఉందని సదరు అధికారులు అభిప్రాయ పడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news