ఏపీ మాజీ మంత్రికి కరోనా పాజిటివ్..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా.. బీజేపీ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. సెల్ఫీ వీడియో ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా సోకితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. సామాజిక దూరం పాటించకుండా ఉంటేనే కరోనా వస్తోందన్నారు.

ఇటీవలే తన మిత్రుడు, తాడేపల్లి గూడెం మన్సిపాలిటీ మాజీ ఛైర్మన్ కు కరోనా వచ్చిందని, విషయం తెలియక తాను ఆయనతో పాటు కారులో ప్రయాణించడం వల్ల కరోనా సోకి ఉండొచ్చని మాణిక్యాలరావు తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. కారులో ప్రయాణించిన తర్వాత కరోనా పరీక్ష చేయించుకుంటే ఈ విషయం బయటపడిందన్నారు. అలాగే వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా సరే భయపడి టెస్టులు చేయించుకోవడం మానొద్దని పైడికొండల మాణిక్యాలరావు సూచించారు. ఇప్పటికే విజయనగరం జిల్లా ఎస్‌కోట ఎమ్మెల్యే, కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే లకి కరోనా సోకిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news