కింద ఇచ్చిన వైరల్ వీడియోను చూశారు కదా.. ఎంత భయంగొలిపే విధంగా ఉందో.. ఓ జింకను కొండ చిలువ అమాంతం చుట్టేసింది. దాన్ని చంపి మింగేందుకు ప్లాన్ వేసింది. కానీ ఎవరో వచ్చి చెట్టు కొమ్మలతో ఆ కొండ చిలువను కదిలించారు. దీంతో అది ఆ జింకను విడిచిపెట్టింది. కొండ చిలువ నుంచి తప్పించుకున్న ఆ జింక.. హమ్మయ్య.. బతికిపోయా.. అంటూ అక్కడి నుంచి పరుగు లంకించుకుంది. ఈ వీడియోను థాయ్‌లాండ్‌లోని ఓ జూలో రికార్డు చేశారు.
థాయ్‌లాండ్‌లోని ఖౌ ఖ్యూ ఓపెన్ జూలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీన్ని కారులో అటుగా వెళ్తున్న ఎవరో షూట్ చేయగా.. 24 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోను జూ అసిస్టెంట్ డైరెక్టర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇప్పటికే ఈ వీడియోను 9.40 లక్షల మందికి పైగా వీక్షించగా, 17వేలకు పైగా లైకులు, అనేక కామెంట్లు వచ్చాయి.
เหตุเกิดเมื่อวานนี้ ณ สวนสัตว์เปิดเขาเขียว pic.twitter.com/btHDDlDkXh
— Visit Arsaithamkul (@papakrab) May 30, 2020
What do you think? The man was right or wrong?#wildlife #wildlifephotography #jimcorbett #tuesdayvibes @NalinYadavIFS @SudhaRamenIFS @JamirShaikh_IFS @vikas_yadav_ifs @ParveenKaswan @s_singh_ifs @SmithamolMS @NatGeoIndia @NatGeoPhotos @susantananda3 pic.twitter.com/ZPmAJIjVNI
— Vineet Vashist (@BashistVineet) June 2, 2020
అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. థాంక్ గాడ్.. ఆ జింకను కాపాడారు.. అని కొందరు కామెంట్లు పెడుతుంటే.. ప్రకృతితో ఆటలాడుకోవద్దని, జీవ ఆహార చక్రాన్ని కొనసాగనివ్వాలని, ఆ జింకను కాపాడకుండా అలాగే వదిలి ఉండాల్సిందని.. కొందరు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా.. ఈ వీడియోను చూస్తే మాత్రం ఎవరికైనా సరే.. వెన్నులో వణుకు పుట్టడం ఖాయం..!