తెలంగాణలో రేషన్ కార్డు దారులకు తీపికబురు అందించనున్నారు కేసీఆర్, తెలంగాణలో రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళో రేపో సీఎం కెసిఆర్ ఈ విషయం మీద నిర్ణయం తీసుకుని త్వరలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో 85 లక్ష ల 54 వేల రేషన్ కార్డులు ఉన్నాయి ఇప్పటిదాకా రేషన్ కార్డు దారులకు దొడ్డు బియ్యం ఇస్తున్నారు.
తాజాగా ఇప్పుడు వారందరికీ కేసీఆర్ తీసుకునే నిర్ణయం మేరకు సన్న బియ్యం సరఫరా చేసే అవకాశం ఉంది. నిజానికి ఎన్నికల్లో గెలవక ముందు ఏపీలోని వైసీపీ కూడా ఇలానే చెప్పింది. కానీ ఎన్నికల్లో గెలిచాకా అందరికీ ఇవ్వడం సాధ్యం కాదని అర్ధం చేసుకుని పైలట్ ప్రాజెక్ట్ గా కన్ని జిల్లాలని ఎంచుకుంది. అయితే అక్కడ వర్కౌట్ కాక ఆపేశారు. మాతమర్చి నాణ్యమైన బియ్యం అంటూ దొడ్డు బియ్యం తరువాత రకాన్ని అక్కడ పంపిణీ చేస్తున్నారు.