నిన్న జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ పై లక్నో గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకూ సాగిన మ్యాచ్ లో కేకేఆర్ పై లక్నో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 14 మ్యాచుల్లో తొమ్మిది విజయాలతో లక్నో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో వికెట్లు నష్టపోకుండా 210 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్ కతా 8 వికెట్ల నష్టానికి 208 పరుగుల చేసింది. దీంతో కేవలం 2 పరుగుల తేడాతో కేకేఆర్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది లక్నో జట్టు. ఈ మ్యాచ్ లో గెలిచి.. ప్లే ఆఫ్స్ కు చేరింది లక్నో.
అయితే.. ఈ మ్యాచ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది లక్నో టీం. లక్నో వికెట్లు నష్టపోకుండా 210 పరుగులు చేయడంతో.. ఈ రికార్డు సాధ్యమైంది. 2022 టోర్నీలో ఇలా వికెట్లు కోల్పోకుండా.. 210 పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఈ రికార్డు ప్రస్తుతం లక్నో పేరుతో నమోదు అయిందన్న మాట.