చిరు ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.. ‘భోళాశంకర్’లో ‘రామ్మా చిలకమ్మా’ సాంగ్ రీమిక్స్!

-

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో చాలా సూపర్​హిట్ పాటలున్నాయి. ఇప్పటికే అందులో నుంచి చాలా హిట్ సాంగ్స్​ను మెగా హీరోలే రీమిక్స్ చేశారు. కానీ చిరు మాత్రం తన పాటలను రీమిక్స్ చేయలేదు. కానీ ఆ తరుణం వచ్చేసింది. మెగాస్టార్ తన పాటలో నుంచి ఓ బ్లాక్​బస్టర్ హిట్ సాంగ్ రీమిక్స్​లో నటించబోతున్నారు. తన హీరోగా నటిస్తున్న మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళాశంకర్​లో ఈ హిట్ సాంగ్ రీమిక్స్ ఉండబోతోందట. ఇంతకీ ఆ పాట ఏంటంటే..?

చూడాలని ఉంది సినిమాలోని ఆల్ టైం క్లాసిక్ సాంగ్ రామ్మా చిలకమ్మ పాటను భోళాశంకర్​లో రీమిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్పుడు మణిశర్మ ఆ సినిమాకు సంగీతం అందిస్తే ఇప్పుడు భోళా శంకర్ కు ఆయన కొడుకు మహతీ స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. చూడాలని ఉంది సినిమా కూడా కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లో వచ్చింది. ఇప్పుడు మెహర్ రమేశ్‌ సినిమా కూడా కోల్​కతా నేపథ్యంలోనే వస్తోంది. సిట్యువేషన్ కూడా సింక్ అవ్వడంతో రామ్మా చిలకమ్మా పాటను ఇందులో రీమిక్స్ చేశారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news