రాధే: సీటీమార్ మ్యాజిక్ రీక్రియేషన్.. సల్మాన్ అభిమానులకి మాత్రమే..

తెలుగు సినిమాలన్నా, తెలుగు పాటలన్నా అమిత అభిమానం చూపించే బాలీవుడ్ హీరోల్లో సల్మాన్ ఖాన్ మొదటి స్థానంలో ఉంటాడు. అందుకే తెలుగు సినిమాలని రీమేక్ చేయడానికి, తెలుగు పాటలు తన సినిమాలో పెట్టుకోవడానికి ఇష్టపడతాడు. వాంటెడ్, రెడీ, జైహో సినిమాలు తెలుగు నుండి రీమేక్ చేసినవే. అలాగే రెడీ సినిమాలో డింకచిక అనే పాటను దేవిశ్రీ చేత మళ్ళీ కంపోజ్ చేసి పెట్టుకున్నాడు. అది ఆర్య 2సినిమాలోని రింగ రింగ పాట అని అందరికీ తెలిసిందే.

తాజాగా ప్రభుదేవా దర్శకత్వంలో రాధే పేరుతీ సల్మాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సీటీమార్ అనే పాటని రీకంపోజ్ చేసారు. తాజగా వీడియో సాంగ్ రిలీజైంది. ఇందులో సల్మాన్ ఖాన్ స్టెప్పులు కొత్తగా ఉన్నాయి. కానీ, అవేమీ ఒరిజినల్ పాటని మరిపించలేకపోయాయనే చెప్పాలి. పాట మొత్తం సల్మాన్ అభిమానులకి విపరీతంగా నచ్చుతుంది. దిశా పటాని గ్లామర్, వేసిన స్టెప్పులు బాగున్నాయి. మొత్తానికి సీటీమార్ మ్యాజిక్ రీక్రియేట్ కాకపోయినప్పటికీ సల్మాన్ అభిమానులని అలరిస్తుంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.