లాక్ డౌన్ లోకి మరో రాష్ట్రం… రేపటి నుండి 15 రోజులు !

కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో మరో రాష్ట్రంలో లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. రేపటి నుంచి కర్ణాటక వ్యాప్తంగా 15 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లుగా కర్ణాటక ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, ఢిల్లీ లాంటి కొన్ని ప్రాంతాలు ప్రకటించాయి. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించాయి.

అయితే తాజాగా కర్ణాటకలో లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఉదయం 6 నుంచి 10 గంటల లోపు ప్రజలు నిత్యావసరాల కొనుక్కునేందుకు బయటకు వచ్చే అవకాశం ఇస్తున్నట్టు ఆదేశాల్లో పేర్కొన్నారు.. రేపటి నుంచి 15 రోజుల పాటు ఈ లాక్ డౌన్ కొనసాగనుంది.. పరిస్థితి ఇలాగే కనిపిస్తే మరిన్ని రాష్ట్రాలు కూడా లాగడాని విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో.