వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ జరిగిందనే వార్తలపై కాకతీయ యూనివర్సిటీ బీసీ రమేష్ తాజాగా స్పందించారు. శనివారం వీసీ రమేష్ మీడియాతో మాట్లాడారు. కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ జరగలేదని స్పష్టం చేశారు. పరిచయ వేదిక పేరుతో జూనియర్లను పిలిచి సీనియర్లు మాట్లాడారని చెప్పారు. హాస్టల్లో మరోసారి సీనియర్లు జూనియర్లను ఇంట్రడక్షన్ తీసుకున్నారని వెల్లడించారు. జూనియర్లను వేధించిన ఆరోపణలపై 78 మంది విద్యార్థులను సస్పెండ్ చేశామని తెలిపారు విసి. వీరిని ఇలా సస్పెండ్ చేయకపోతే వీరికి భయం ఉండదని.. వీరికి కాస్త భయం ఉండాలనే సస్పెండ్ చేసినట్లు వీసీ వెల్లడించారు.
అయితే అర్ధరాత్రి లేడీస్ హాస్టల్ లో సీనియర్ లు తమను వేధచారని జూనియర్ విద్యార్థినిలు ఆరోపించిన విషయము తెలిసిందే. జువాలజీ కామర్స్ ఎకనామిక్స్ విభాగాలకు చెందిన 81 మంది యువతులపై వారం పాటు సస్పెన్షన్ విధించినట్టు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే యూనివర్సిటీలో ర్యాగింగ్ జరగలేదని వీసీ రమేష్ క్లారిటీ ఇవ్వడం గమనార్హం.