Ishan Kishan: ఇషాన్‌ కిషన్‌ తప్పుకోవడానికి కారణమదేనా….?

-

దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్ కిషన్ వన్డే సిరీస్ జరుగుతుండగానే వ్యక్తిగత కారణాలు అని చెప్పి ఇండియాకి తిరిగి వచ్చాడు. టెస్ట్ సిరీస్ కి ఎంపికైన ఇషాన్ కిషన్…. ఆ సిరీస్ నుంచి కూడా తప్పకున్నాడు. అయితే ఇషాన్ కిషన్ ఈ సిరీస్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు అటు ఇషాన్ కిషన్ గాని బీసీసీఐ గాని వెల్లడించ లేదు. అయితే ‘మానసిక కుంగుబాటు’ వల్లనే సిరీస్ నుంచి తప్పు కున్నట్లు తెలుస్తుంది.

ఇటీవల కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇండియా టీం ఆడిన ప్రతి ద్వైపాక్షిక సిరీస్‌లోనూ ఇషాన్ కిషన్ సభ్యుడిగా ఉన్నాడు. అలాగే ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ టోర్నీకి ప్రకటించిన సభ్యులలో చోటు సంపాదించుకున్నప్పటికీ ప్లేయింగ్ ఎలెవన్ లో మాత్రం చోటు సంపాదించుకోలేకపోయాడు.

 

జనవరిలో న్యూజిలాండ్‌,శ్రీలంకతో టీ20 ,వన్డే సిరీస్‌లు ఆడిన ఇషాన్ కి ఫిబ్రవరి – మార్చిలో జరిగిన బోర్డర్‌ – గవాస్కర్‌ ట్రోఫీ లో కూడా జట్టులో చోటు సంపాదించుకున్నాడు. కానీ రెండు నెలలపాటు జట్టుతో ఉన్నప్పటికీ తుదిజట్టులో స్థానం దక్కలేదు. ఆ తర్వాత ఐపీఎల్ లో రెండు నెలల పాటు ఆడాడు. జూన్లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నీకి కూడా ఎంపిక అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news