తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన..!

-

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఈనెల 28 నుంచి ఇచ్చేందుకు కసరత్తూ మొదలుపెట్టిందని వస్తున్న వార్తలపై తాజాగా పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇతర ప్రచార మాధ్యమాల్లో రేషన్ కార్డుల జారిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద అనే అంశాన్ని ఖండించారు అధికారులు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరు ఇలా చేస్తున్నారు తమకు తెలియడం లేదని తలబాదుకుంటున్నారు. తమకు ఉదయం నుంచి కార్యాలయానికి వందలాది ఫోన్లు వస్తున్నాయని అధికారులు ఆశ్చర్యపోయారు.

ఉన్నతాధికారుల తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని స్పష్టం చేశారు. ఈనెల 12వ తేదీన పౌరసరఫరా శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ పెండింగ్ రేషన్ కార్డులపై నిర్ణయం ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తో అలాగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. విషయాన్ని అధికారులు కూడా ధృవీకరించారు. తమకు మంత్రి నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని వెల్లడించారు ఉన్నతాధికారులు. ప్రభుత్వం నుంచి ఏమైనా అధికారిక సమాచారం వస్తే తామే వెల్లడిస్తామని.. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. వాట్సాప్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వాటికి తాము ఏమీ సమాధానం చెప్పలేదా చెప్పలేమని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల గురించి వస్తున్న రూమర్స్ ను ప్రజలు అసలు నమ్మవద్దని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news