లారెన్స్ బర్త్ డే గిఫ్ట్ గా ‘రుద్రుడు’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల

-

తమిళంతో పాటు తెలుగు .. కన్నడ .. మలయాళ భాషల్లో లారెన్స్ వరుస సినిమాలతో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు .. తమిళ భాషల్లో ‘కాంచన’ .. ‘గంగ’ వంటి సినిమాలు ఆయనకి కాసుల వర్షం కురిపించాయి. ఆ తరువాత చేసిన ‘శివలింగ’ కూడా ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది. ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన మార్కు సినిమాలు రాలేదు. అలాంటి అభిమానుల కోసం ఆయన ‘చంద్రముఖి 2’ సినిమాలు చేస్తున్నాడు. అలాగే ‘రుద్రుడు’ అనే సినిమాను కూడా పట్టాలెక్కించాడు. తమిళంతో పాటు తెలుగు .. కన్నడ .. మలయాళ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కథిరేసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి, లారెన్స్ బర్త్ డేను పురస్కరించుకుని కొంతసేపటిక్రితం ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు.

Rudrudu first glimpes release

వచ్చే ఏప్రిల్లో ఈ సినిమాలు విడుదల చేయనున్నారు. అలాంటి సినిమాల కోసమే అభిమానులు ఎదురుచూస్తున్నారు. యాక్షన్ సీన్ ప్రధానంగా సాగిన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. లారెన్స్ జోడీగా ప్రియా భవానీ శంకర్ నటిస్తున్న ఈ సినిమాలో, శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news