ప్రముఖ తెలుగు దర్శకుడు రాఘవేంద్రరావు కారుకు ప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం తిరుమలకు వెళ్తుండగా మొదటి ఘాట్ రోడ్డులో కారు అదుపు తప్పి పిట్ట గోడను బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న రాఘవేంద్రరావు వ్యక్తిగత సహాయ సిబ్బంది మురళి, సుమన్ కు స్వల్ప గాయాలు.. కారు డ్రైవర్ బాలాజీకి తీవ్ర గాయాలయ్యాయి.. దీంతో డ్రైవర్ ని ప్రాథమిక చికిత్స అనంతరం స్విమ్స్ కు తరలించారు. ప్రమాద సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మరో కారులో తిరుమలకు వెళ్తుడంతో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ఛైర్మన్, తితిదే బోర్డ్ మెంబర్ గా ఉన్న రాఘవేంద్రరావు తరచు తిరుమలకు వెళ్లే విషయం తెలిసిందే.