నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ రాజకీయాల్లో సృష్టించిన గందరగోళం అంతా ఇంతా కాదు. సొంత పార్టీ నేతల మీదనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చర్యపై కూడా రఘురామకృష్ణంరాజు ఘాటుగానే స్పందించారు. అయితే తాజాగా ఢిల్లీలో పర్యటిస్తోన్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈ రోజు కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. తనకు వైసీపీ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసుపై రాజ్‌నాథ్ తో చర్చిస్తున్నారు.
తనకు వైసీపీ జారీ చేసిన షోకాజు నోటీసు చెల్లుబాటు కాదని, దానిపై ఏపీ సీఎం జగన్ సంతకం లేదని ఆయన అంటున్నారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదైన వైసీపీ అసలు పేరు, తనకు షోకాజు నోటీసుల్లో ఉన్న పార్టీ పేరు మధ్య కూడా వ్యత్యాసంపై ఉన్నట్లు ఆయన నిన్న ఈసీకి కూడా వివరించారు. తమ పార్టీలో క్రమశిక్షణ కమిటీ లేదని, తనపై చర్యలు ఎలా తీసుకుంటారాని ఆయన వాదిస్తున్నారు. కాగా, ఆయన నిన్న లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను, ఎన్నికల కమిషన్ అధికారులను కలిసిన విషయం తెలిసిందే.