అసెంబ్లీ లో సీఎం కెసిఆర్ అన్నీ అబద్ధాలు చెప్పారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. దళితుల కు మూడు ఎకరాలు ఇస్తానని చెప్పలేదని అబద్ధం చెప్పారని.. సీఎం పై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ అవకాశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. మూడు ఎకరాల భూమి విషయం లో భగవద్గిత, ఖురాన్, బైబిల్ మీద ప్రమాణం చేసి చెబుతావా? అని సవాల్ విసిరాడు రఘునందన్ రావు. కోనేరు రంగారావు కమిటీ రిపోర్ట్ ను అసెంబ్లీలో ఎందుకు పెట్టడం లేదని.. సమగ్ర కుటుంబ సర్వే ని బయట ఎందుకు పెట్టడం లేదని నిప్పులు చెరిగారు.
దేశం గురించి ఎందుకు… రాష్ట్రం లో కుల గణన పై నువు చేసిన సర్వే బయట పెట్టు అంటూ సిఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగాడు. ఎస్సి వర్గీకరణ కోసం మోడీ అపాయింట్మెంట్ కోరావా అని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు లో బీసీ కుల గణన కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు రాష్ట్ర శాసన సభలో తీర్మానం ఎలా చేస్తారని నిలదీశారు.
ఎక్కడ వచ్చే డబ్బులు అక్కడే ఖర్చు పెట్టాలని అంటే కెసిఆర్ నియోజకవర్గం గజ్వేల్ కి డబ్బులు ఎక్కడివి ? అని ప్రశ్నించారు. గ్రామీణ ఉపాధి నిధులు, ఫైనాన్స్ కమిషన్ నిధులు లేక పోతే పంచాయతీ ల పరిస్థితి ఏంటి..? అని ఫైర్ అయ్యారు.