సీఎం కేసీఆర్ పై జగపతిబాబు ప్రశంసలు

-

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గ్రీన్ ఫండ్ ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని అన్నారు వర్సటైల్ యాక్టర్ జగపతిబాబు. పచ్చదనం పెంపును ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకునే వీలును గ్రీన్ ఫండ్ కల్పిస్తుందని ఆయన అన్నారు. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో జరుగుతున్న సింబా – ద ఫారెస్ట్ మ్యాన్ షూటింగ్ లో జగపతిబాబు పాల్గొన్నారు. మనకు బతుకునిచ్చే మొక్కను బతకనిద్దాం అనే నినాదంతో ఈ చిత్రం రూపొందుతోంది.

అడవులు, పర్యావరణం ప్రాధాన్యత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు అటవీ అధికారి పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సంపత్ నంది, మిగతా యూనిట్ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎం.పీ. జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి జగపతిబాబు మొక్కలు నాటారు.

అనంతరం జగపతి బాబు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని, అదే సమయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో ఎంపీ సంతోష్ కుమార్ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారని కొనియాడారు. అన్ని వర్గాలను గ్రీన్ ఇండియాలో భాగస్వామ్యం చేయటం సంతోషంగా ఉందన్నారు. ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ పీ.వీ. రాజారావు, దర్శకుడు సంపత్ నంది, నిర్మాతలు రాజేందర్ రెడ్డి, మురళీ మనోహర్ రెడ్డి, యంగ్ హీరో శ్రీనాథ్ మాగంటి, హీరోయిన్ దివి వధ్వ, ప్రతి నాయకుడు కబీర్ దుహన్ సింగ్, చిత్ర యూనిట్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

Read more RELATED
Recommended to you

Latest news