పేపర్‌ లీక్‌ లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల పేర్లు బయటపెట్టాలి – రఘునందన్ రావు

-

పేపర్‌ లీక్‌ లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మంత్రులు మాట్లాడిన తీరు తల్లి దండ్రులకు భరోసా కల్పించకుండా వారికి ఆవేదన కలిగించిందని..రాజకీయ రంగు పులమాలని చూసారని ఆగ్రహించారు. కొందరు పోలీస్ లు సహకరించారు.. వరంగల్ CP మొన్న మాట్లాడిన దానికి నిన్న జరిగిన మాట్లాడిన దానికి చాలా తేడా ఉందని తెలిపారు.

హిందీ పేపర్ ను పోటో తీసిన అతనికి బీజేపీ కి ఉన్న సంబందం ఏంది…పరీక్ష కేంద్రం వద్ద ఒక పోలీస్ కూడా లేడా.. శివ గణేష్ పోన్ నుండి ఎంత మందికి ఆ పేపర్ వెళ్ళిందన్నారు.శివ గణేష్ పోన్ నీ సీజ్ చేశారా… రిమాండ్ రిపోర్ట్ లో పెట్టారా అని ప్రశ్నించారు. 9.37 నుండి బండి సంజయ్ పోన్ కు వచ్చే వరకు ఎవరెవరి దగ్గరికి వెళ్ళిందోనని ఎందుకు చెప్పడం లేదన్నారు. ప్రశాంత్ పంపించారు కాబట్టి బండి సంజయ్ ముద్దాయి అయిండు.. అధికార పార్టీ పేపర్ , ఛానల్ కి ఆ పేపర్ వెళ్లిందా లేదా సీపీ చెప్పాలన్నారు. ఎంత మంది రాజకీయ నాయకులకు అది వెళ్ళింది చెప్పాలని ఫైర్‌ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version